Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేషనల్ అవార్డ్స్ ఖాయం

నేషనల్ అవార్డ్స్ ఖాయం

- Advertisement -

హీరో రవితేజ నటించిన సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరి యన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నేను ప్రేమ కథలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఈ సినిమా మాత్రం చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ కథ చెప్పినప్పుడే నేను అందులో లీనమై పోయాను. తెలుగు సినిమాకి ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో వచ్చే మలుపులను ప్రేక్ష కులు ఊహించలేరు. ఈ సినిమాకి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మేము మా బెస్ట్ ఇచ్చాం. ఈ సినిమాకి బెస్ట్ రీజినల్ ఫిలిం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇలా చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నేను ఆశిస్తు న్నాను. అలాగే కమర్షియల్‌గా కూడా సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా మ్యూజిక్ నాకు చాలా స్పెషల్. ఇందులో ప్రతిదీ సైకలా జికల్‌గా ఉంటుంది. మనం ఒకటి ఊహిస్తాము కానీ వేరే మలుపు వస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -