ఐద్వా ఆధ్వర్యంలో పూలే జయంతి
నవతెలంగాణ – మిర్యాలగూడ
జనవరిలో 25, 26, 27, 28 తేదీలలో హైదరాబాదులో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి కోరారు. శనివారం ఐద్వా ఆధ్వర్యంలో పట్టణంలో పూలే జయంతి నిర్వహించారు.పూలే చిత్రపటానికి పూలమానులేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అణిచివేతలు అసమానతలను వ్యతిరేకించి సమాన హక్కులను కల్పించాలన్నారు. విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలియంగా నమ్మి దేశంలో మొట్టమొదటి మహిళా మహిళా పాఠశాలను స్థాపించిందని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అణగారిన జీవితాలలో వెలుగులు నింపి ఆనాడు మహిళలపై ఆనచివేత వితంతు వివాహాలను ఎదిరించి పాఠశాలను స్థాపించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలన్నారు.
ప్రభుత్వము సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించాలని అన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మనుల అరుణ వన్ టౌన్ అధ్యక్షురాలు కొంపెల్లి కౌసల్య, టూ టౌన్ కార్యదర్శి పాదూరు గోవర్ధనా, మధ్యాహ్నం భోజనం అధ్యక్షురాలు ఎస్.కె కరీమున్నీసా ఐద్వా వన్ టౌన్ ఉపాధ్యక్షురాలు మణెమ్మ సిపిఐ టౌన్ అధ్యక్షురాలు ఎస్కే షమీం ఐద్వా నాయకులు లలిత పాల్గొన్నారు



