Tuesday, September 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం900 దాటిన నేపాల్‌ మృతులు

900 దాటిన నేపాల్‌ మృతులు

- Advertisement -


ఇంకా లభించని నాలుగు వేల మంది ఆచూకీ
ఖాట్మండు :
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలలో మరణించిన వారి సంఖ్య సోమవారం 903కు చేరింది. ఇప్పటికీ 4,247 మంది ఆచూకీ లభించడం లేదు. తొలగిస్తున్న శిధిలాల నుంచి మరిన్ని మృతదేహాలు లభ్యమవుతుండడంతో మృతుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. చిట్వాన్‌ నుంచి 272, నావల్‌పరాసీ ఈస్ట్‌ నుంచి 207, నావల్‌పరాసీ వెస్ట్‌ నుంచి 151, గోర్ఖా నుంచి 62 మృతదేహాలను వెలికితీశారు. అదే విధంగా నువాకోట్‌, ధాడింగ్‌, తనూహా, రసువాలో కూడా మృతదేహాలు బయటపడుతున్నాయి. వరదల కారణంగా దేశంలోని ఆరు జల విద్యుత్‌ ప్రాజెక్టులలో కనీసం 933 మంది కార్మికులు చిక్కుబడిపోయారు. దేశం అనూహ్యమైన, విషాదకరమైన విపత్తును ఎదుర్కొంటోందని ప్రధాని బాలేంద్‌ షా చెప్పారు. కాగా నేపాల్‌, చైనాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మహారాష్ట్రకు చెందిన 262 మంది చిక్కుకుపోయారు. 144 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వరదలలో ఆచూకీ తెలియకుండా పోయిన హైకోర్టు న్యాయమూర్తి వి.శివజ్ఞానం ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తిని మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ కోరింది. ఇదిలావుండగా కర్నాటక నుంచి వెళ్లిన 13 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -