– హైదరాబాద్ పరిధిలోని ప్రతి చోటా ఇదే పరిస్థితి
– రాష్ట్రంలో కొరత లేదు
– రిఫైనరీల నుంచి సక్రమంగా ఇంధన సరఫరా : పౌరసరఫరాలశాఖ
– వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూ
– పజలు భయపడి అనవసర కొనుగోళ్లు చేస్తున్నారని వ్యాఖ్య
హైదరాబాద్: పశ్చిమాసియాలో సంఘర్షణల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకులవైపు పరుగులు తీస్తున్నారు. దీంతో హైదరాబాద్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ‘నో’ స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంబర్‌పేటలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ల దగ్గర ఆటో డ్రైవర్లు క్యూ కట్టారు. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వాహకులు గ్యాస్ ఎప్పుడు వస్తుందో తమకు తెలియదని, గ్యాస్ వచ్చినప్పుడు ఫిల్ చేస్తామని చెబున్నారు. దీంతో గ్యాస్‌లేక ఆటోలు నడవడం లేదని, ఇల్లు గడవడం కష్టమవుతోందంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌కు కొరత లేదు: పౌరసరఫరాల శాఖ
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడిందన్న వదంతులపై తెలంగాణ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ స్పందించింది. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ – ఎల్‌పీజీ కొరత లేదని స్పష్టం చేసింది. అన్ని ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోలకు ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని తెలిపింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో పొడవైన క్యూలు, తాత్కాలికంగా ”నో స్టాక్” బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం తప్పుడు వదంతులేనని పేర్కొంది. ప్రజలు భయపడి ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమే కారణమని తెలిపింది.
బంకులు బంద్… కిలో మీటర్ మేర ఆటోల క్యూ
హైదరాబాద్‌లోని పాతబస్తీలో పలు పెట్రోల్, గ్యాస్ బంకులను మూసివేశారు. బహదూర్‌పురా, మీర్ అలం, హస్సన్ నగర్, చంపాపేట్, సంతోష్ నగర్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. ‘పెట్రోల్ లేదు’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ దొరకదేమోనన్న పుకార్లతో పాతబస్తీలో చాలాచోట్ల క్యాన్లలో తీసుకెళ్లడం కనిపించింది. మరోపక్క గ్యాస్ కోసం గంటలకొద్దీ ఆటో డ్రైవర్లు ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ల దగ్గర కిలో మీటర్ మేర ఆటోలు క్యూ కట్టడం కనిపించింది.
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



