Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పద్మశాలి కుల బాంధవుల నూలు పూర్ణిమ వేడుకలు

పద్మశాలి కుల బాంధవుల నూలు పూర్ణిమ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో పద్మశాలి కుల బాంధవులు శనివారం నూలు పూర్ణిమ వేడుకలను వారి వారి సంఘ భవనాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని ఉప్లూర్  ఓం శ్రీ మొదటి పద్మశాలి సంఘ భవనంలో శనివారం నూలు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూలు పూర్ణిమను పురస్కరించుకుని నిర్వహించిన సంఘ సర్వసభ్య సమావేశంలో పద్మశాలి కుల దైవమైన మార్కండేయ మహర్షి చిత్ర పటానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సంఘ సభ్యులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం సంఘ సభ్యులు నూలు పూర్ణిమ (జంధ్యాల పూర్ణిమ) సందర్భంగా సంఘ సభ్యులు అందరూ గాయత్రి మంత్ర జపం చేసి జంధ్యం స్వీకరించారు. సభ్యులు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకున్నారు.

కార్యక్రమంలో ఓం శ్రీ మొదటి పద్మశాలి సంఘం అధ్యక్షులు జిందం రమేష్,  ఉపాధ్యక్షులు ఎనుగందుల శైలేందర్, కార్యదర్శి జిందం మల్లేష్, కార్యవర్గ సభ్యులు, జిల్లా పద్మశాలి యువజన సంఘం కార్యదర్శి యెనుగందుల శశిధర్, కార్యవర్గ సభ్యులు ద్యావరశెట్టి హన్మాండ్ల,  దైవశెట్టి అంగరి రమేష్ మండల కార్యవర్గ సభ్యులు నాగుల ప్రసాద్,  సంఘం సీనియర్ సభ్యులు యెనుగందుల జనార్ధన్, అలిశెట్టి సత్యం, సంఘ సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.

కమ్మర్ పల్లిలో…..

 మండల కేంద్రంలోని హోం పద్మశాలి విజయ సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కులదైవం మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు చిలివేరి శ్రవణ్ కుమార్ చక్కటి మంత్రోత్సవంతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులు జంజం ధరించి ‘నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనం ఇద్దరం కలిసి సంఘానికి, సమాజానికి రక్ష’ అంటూ రాఖీలు కట్టుకున్నారు.

అనంతరం సంఘ సభ్యులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని సంకల్పంతో మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని సర్వసభ్య సమావేశం తీర్మానించారు.గణపతి విగ్రహం దాతగా ఆడిచర్ల రజనీకాంత్ రాజేశ్వర్, మహా అన్నదాన ప్రసాదం దాతగా బోగ రామస్వామి ముందుకు రావడంతో వీరిని సంఘ సభ్యులు అందరూ కరతాల ద్వనులతో స్వాగతించారు. కాగా మండలంలోని ఆయా గ్రామాల్లో కూడా నువ్వులు పూర్ణిమ వేడుకలని పద్మశాలి కుల బాంధవులు ఘనంగా నిర్వహించుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img