– కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి
– సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు
నవతెలంగాణ – బల్మూర్
గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలలో వ్యక్తీ చేస్తున్నారని వాళ్ళ హక్కులను సాధించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ మండల రెండోవ మహాసభ నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు పెట్టి చేస్తున్నారని వారికి కనీస వేతన చట్టాన్ని అమలుచేసి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకపోతేనే ఓడించి ఇంటికి పంపామని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులను కనీస వేతన చట్టాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న మాట ఏమైందని వారు ప్రశ్నించారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రాబోయే కాలంలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకరు ఇజ్జాస్ ఈశ్వర్ రాంబాబు సైదులు ఎల్ల స్వామి శ్రీను కృష్ణ స్కైలాబ్ అలివేల, తదితరులు ఉన్నారు.మండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
పంచాయతీ కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES