నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దళిత సంఘం ఆధ్వర్యంలో పంద్రాగస్టు పండుగను సంఘం సభ్యులు కాంబ్లే కిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహ నికి పూలమాలలు వేసి దళిత సంఘం నాయకుడు కాంబ్లే కిషన్ జెండాను ఎగరవశారు. ప్రతియేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విండో చైర్మన్ శివానంద్, మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు , రాజులు సెట్, సాయ గౌడ్, నీలు పటేల్ , మారుతి పటేల్ , వాస్రే రమేష్ , బిజెపి యువ నాయకుడు రాజు పటేల్ , దళిత సంఘం నాయకులు సురేష్, తుకారం, ఎస్ఎఫ్ఐ నాయకుడు అజయ్ కుమార్, గ్రామ పెద్దలు , వివిధ పార్టీ నాయకులు , దాదారావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.
దళిత సంఘం ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES