Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: సీఐటీయు డిమాండ్

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: సీఐటీయు డిమాండ్

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 
జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని వసతి గృహ కార్మికుల సంఘం(సిఐటియు అనుబంధం) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయాకర్, ఆనందరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాలలో కార్మికులకు 13 నెలల నుండి, బీసీ సంక్షేమ వసతి గృహ కార్మికులకు ఎనిమిది నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. నెలల తరబడి కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉంచితే తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల సాంఖ్యకు అనుగుణంగా కార్మికులు లేకపోవడం వల్ల, కొన్నిచోట్ల ఒక్క కార్మికుడే వసతి గృహం మొత్తాన్ని చూసుకుంటూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ వేతనాలు పెండింగ్లో లేవని కానీ జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రమే ఎస్సీ సంక్షేమ వసతి గృహ కార్మికులకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు.

సంక్షేమ వసతి గృహాలలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న క్యాటరింగ్ కార్మికులను ఔట్సోర్సింగ్ కార్మికులుగా చేర్చి వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సింది పోయి ST వసతి గృహ కార్మికులకు వేతనాల తగ్గించడం సరైనది కాదన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా కార్మికులను నియమించి పని భారం తగ్గించాలని,  వసతి గృహ కార్మికులకు నెల నెల సక్రమంగా వేతనాలు అందజేసేల చర్యలు తీసుకోవాలని,పియఫ్ నెల నెల కార్మికుల ఖాతాలో అందజేసే విదంగా చర్యలు తీసుకోవాలని జిల్లాలో వేతనాల పెండింగ్ గల కారణాలను అధ్యయనం చేసి తక్షణమే కార్మికులకు వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ కార్మికులు రామకృష్ణ దానయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -