Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
జిల్లా లోపెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలనీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం మినీ కలెక్టరేట్ హాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి లో ఉన్న పనులపై సంబంధిత పంచాయతీరాజ్  ఈ ఈ, ఆర్ అండ్ బి ఈ ఈ, డి ఈ, ఏ ఈ లతో డబుల్ బెడ్ రూమ్ ల పై  సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ లో  పైప్ లైన్లు, కరెంటు, డ్రైనేజీ, వంటి  చిన్న, చిన్న మౌళిక వసతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికి కరెంటు, నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. కరెంటు స్తంభాలకు  కనెక్షన్లు  ఇచ్చి ప్రతి ఇంటికి త్వరగా విద్యుత్ వచ్చేలా చూడాలన్నారు. డ్రైనేజీ, తదితర సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి ఉపయోగం లోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -