నీడల ప్రపంచం’ పుస్తకావిష్కరణ
రచయిత ఎన్.తిర్మల్ సమకాలీన సమస్యల సమాహారం వ్యాసాల సంపుటి ‘నీడల ప్రపంచం’ పుస్తకావిష్కరణ సభ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్, ఫస్టుఫ్లోర్‌లో జరుగుతుంది. ఈ సభకు హనీఫ్, డాక్టర్ ఆయాచితం శ్రీధర్, సతీష్ చందర్, ఆకునూరి మురళి, ఏనుగు నర్సింహారెడ్డి, జూలూరి గౌరీశంకర్, ప్రొ.వినాయకరెడ్డి, నిమ్మగడ్డ కార్తీక్, మువ్వా శ్రీనివాస్ రావు, డా.యస్.రఘు, డా.దిడ్డి సుదాకర్, టివి శ్రీనివాస్.
- తపస్వి మనోహరం పబ్లికేషన్స్
తెలంగాణ రచయితల సంఘం పన్నెండేండ్ల సభలు
*వర్తమాన సాహిత్యం - తెలంగాణ సంభాషణ*
నవంబర్ 1న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవీంద్రభారతి సమావేశ మందిరం, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో డా. నాళేశ్వరం శంకరం, కె. శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, డా. ఏనుగు నరసింహా రెడ్డి, దేవీ ప్రసాద్, విరాహత్ అలీ, బైస దేవదాసు, డా. వి. శంకర్, డా. బెల్లంకొండ సంపత్ కుమార్, ఎన్. వేణు గోపాల్, ఆచార్య బన్న అయిలయ్య, డా. నామోజు బాలాచారి, కొండపల్లి నిహారిణి, కందుకూరి శ్రీరాములు, డా. జయ ప్రకాశ్ పాల్గొంటారు. సుప్రసిద్ధులైన నలభై మంది కవుల/ కవయిత్రుల కవితా పఠనం వుంటుంది.
- తెలంగాణ రచయితల సంఘం
ఎల్ నినో పై కవితలకు ఆహ్వానం
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విద్యార్థులు అంజి బాబు ట్రస్ట్ సహకారంతో ‘ఎల్ నినో’ అంశంపై కవితలు ఆహ్వానిస్తోంది. సమాజంలో చైతన్యం నింపేలా, అవగాహన పెంచేలా కవులు, నేటి ఎల్ నినో పరిస్థితులకు కర్త కర్మ, క్రియ మానవుడు అయినందున, ఎల్ నినో-కాలం విసిరిన సవాల్ అనే కవితా సంకలనం తేవాలని ప్రయత్నం. చివరి తేదీ అక్టోబర్ 31. కవితలను తెలుగులో టైప్ చేసి కొండూరి కోటి బాబు- 9666233115, ఎస్ కళ్యాణ్ దాస్- 9985412333, నాగుల అంజిబాబు - 9063214441 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపగలరు.
- సంపాదకవర్గం





కామెంట్‌లు (0)