Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతి చట్టం ప్రకారమే దరఖాస్తులు స్వీకరించండి..

భూభారతి చట్టం ప్రకారమే దరఖాస్తులు స్వీకరించండి..

- Advertisement -

అదనపు కలెక్టర్ వి విక్టర్..
నవతెలంగాణ – మద్నూర్
: భూభారతి చట్టం ప్రకారమే రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించండి అని ఫారెస్ట్ భూముల పట్ల జాగ్రత్తగా పరిశీలించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ చేలూరును సందర్శించి, సదస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సదస్సులో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో భూభారతి చట్టం ప్రకారమే రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. ఫారెస్ట్ భూములను జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సదస్సులో గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా సహకారాలు అందించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంగుల పండరి మాజీ ఎంపిటిసి విజయ్, తోటా నాగనాథ్, మాజీ ఉపసర్పంచ్ ఏక్ నాథ్, బిజెపి నాయకులు హనుమాన్లు, తదితరులను చూసి మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ ప్రత్యేకంగా అభినందించారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎండి ముజీబ్, డిప్యూటీ తాసిల్దార్ శివరామకృష్ణ, ఆర్ ఐ శంకర్, రెవిన్యూ సిబ్బంది, ఆ గ్రామ కార్యదర్శి విజయ్ ,కారోబార్ గంగాధర్ వ్యవసాయదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -