Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రదేశాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రదేశాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం అర్ధ రాత్రి సమయంలో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నటువంటి బాసర, ఉమ్మడి బ్రిడ్జి, బోధన్, బోర్గాం తదితర ప్రదేశాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షించారు. వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని పౌరులందరినీ వినమ్రంగా కోరుతున్నాము. ప్రజలందరూ పోలీసులకు సహకారాన్ని అందించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ నంబర్కు కాల్ చేయగలరు లేదా సమీప పోలీసులను సంప్రదించగలరు. ఈ పవిత్ర వేడుకను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు, సిఐలు, ఎస్సైలు మరియు బందోబస్తు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -