Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మీయ సన్మాన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

ఆత్మీయ సన్మాన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవూర
మండల పరిధిలోని బట్టు గూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ పిలుపుమేరకు ఆదివారం ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం పోస్టర్ ను ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈసందర్బంగామాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 16న బుధవారం నాడు ఉదయం 11 గంటలకు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాదులోని హోటల్ హబ్సిగూడ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు ఆదిమల్ల సత్యనారాయణ , దండెంకొండలు,ఆదిమల్ల శేఖర్ , రేపాక ఎల్లయ్య , ఆదిమల్లయశోద,జానమ్మ,ఈదమ్మ,దేవి,కాశమ్మ  , పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -