Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రగతిశీల మేధావి, ప్రముఖ రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

ప్రగతిశీల మేధావి, ప్రముఖ రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత, అనువాదకులు, ప్రగతిశీల మేధావి ముక్తవరం పార్థసారథి బుధవారం రాత్రి కన్నుమూశారు. వామపక్ష భావజాలంలోనూ, విశ్వసాహిత్యంలోనూ విశేషపరిజ్ఞానం కలిగిన పార్థసారథి జీవితాంతం రచనలకూ, అభ్యుదయానికే అంకితం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత రచనలను తెలుగులోకి తేవడానికి, తెలుగువారికి పరిచయం చేయడానికి చివరిదాకా ఆయన శ్రమించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జులై 7న జన్మించిన ముక్తవరం పార్థసారథికి 17వ ఏటనే రచయితో చలంను కలిసి, ఆయన ప్రేరణతో సాహిత్య పరిచయం పెంచుకున్నారు. 1959లో గోల్కొండ పత్రికలో ఆయన తొలి రచన వచ్చింది.ఆయన హైదరాబాదులో తన చదువు పూర్తి చేశారు. రిజర్వ్‌ బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. 2002లో ఉన్నతస్థాయిలో పదవీ విరమణ చేశారు.

అప్పటికే నిరంతరాయంగా పుస్తకాలు రాస్తూ వచ్చిన పార్థసారథి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒకేసారి ఏడు నవలలు విడుదల చేసి సంచలనం సృష్టించారు. దాదాపు 70కి పైగా వైవిధ్యభరితమైన రచనలు వెలువడ్డాయి. ఆయన భార్య వసంత చిత్రకారిణి. రాలిన ఆకులపై ఆమె గీసిన చిత్రాలు ప్రత్యేకమైనవి. చివరి వరకూ భర్తకు సేవలందించిన ఆమె ఆయన భౌతికకాయాన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు అందిస్తున్నారు. వారిద్దరి కుమారులు అమెరికాలో ఉంటున్నారు. శుక్రవారం భారత్‌కు రానున్నారు. ఆయన మరణవార్తతో సాహిత్యలోకం ప్రగాఢ సంతాపం ప్రకటించింది. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవతెలంగాణ బుకహేౌస్‌ ఎడిటర్‌ ఆనందచారి నివాళులర్పించారు. ముక్తవరం పార్థసారథితో వ్యక్తిగతంగానూ, రచనల ప్రచురణతోనూ సుదీర్ఘ పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, ప్రజాశక్తి బుకహేౌస్‌ మేనేజర్‌ కె.లక్ష్మయ్య జోహారులర్పించారు. ప్రగతిశీల భావజాలంలో ఆయన సేవలు మరవరానివి, మార్గదర్శకమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -