నవతెలంగాణ – జుక్కల్
చుక్కల మండలంలోని దోస్తుపల్లి గ్రామానికి చెందిన వివేకానంద్ యూత్ ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా గ్రామస్తులకు పేదలకు విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఒక ప్రకటనలో యూత్ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ఆర్థికంగా వెనుకబడి ఉండి చదువులో ముందుండి చదవలేని దుస్థితిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు, అనారోగ్య బాధితులకు, నిరుపేద రోగులకు ఆస్పత్రి ఖర్చులకు, మరణించిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
ఇప్పటికే గ్రామంలోని పలువురికి ఆర్థికంగా ఆదుకున్నామని సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వివేకానంద యూత్ లో మొత్తం మంది 60 నుండి 70 మంది సభ్యులం ఉన్నామని తెలిపారు. ప్రతినెల యూత్ సభ్యులు సంపాదించిన డబ్బులో కొంత మేరకు యూత్ ఆర్గనైజేషన్ లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఆ నగదునే పేదవారికి సాయంకింద అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



