నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ బుధవారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, సిబ్బందికి ఎల్లప్పుడూ శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే, ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఆధునాతన సదుపాయాలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. త్వరలోనే అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమయపాలన పాటించాలని, ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ట అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహారావు, మామిళ్ళపల్లి ఆలయ చైర్మన్ నరసింహారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, వైద్యాధికారిణి డాక్టర్ స్వప్న, డాక్టర్ శివలీల, నర్సింగ్ ఆఫీసర్లు ఉఫాత్, నిర్మల, ఫార్మసీ ఆఫీసర్ కుమారాచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.