నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పాత బస్టాండ్ పట్టణ పద్మశాలి సంఘ భవనంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మార్కండేయ మందిరంలో అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్,కార్యదర్శి కొక్కుల రమాకాంత్,కోశాధికారి బత్తుల భాస్కర్,సర్వ సమాజ ప్రతినిధి కొక్కుల విద్యాసాగర్ తర్ప అధ్యక్షులు బండి అనంత రావు రుద్ర రాజేశ్వర్ లు మార్కండేయ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయించి,పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత సమావేశ హాలులో జంధ్యాల పూజ,రుద్ర హోమం, పూర్ణాహుతి,యజ్ఞోపవీత ధారణ కార్యక్రమానికి వచ్చిన పద్మశాలి కుల బాంధవులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం నిర్వహించే కార్యక్రమాలలో రాఖీ పౌర్ణమి (జంధ్యాల పండగ) మన పద్మశాలీలకు అతిపెద్ద పండగ అన్నారు.ఒకరికొకరు రక్షాబంధన్ చేసుకుని నాకు నీవు తోడు నీకు నేను తోడు మనమిద్దరం దేశానికి, సమాజానికి తోడని, రక్షాబంధన్ చేసుకోవడం, గాయత్రి మంత్రంతో యజ్ఞోపవీత ధారణ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోందన్నారు.మున్ముందు అనేక కార్యక్రమాలు నిర్వహించి పద్మశాలిల ఐక్యతకు ఉన్నతికి కృషి చేస్తామని,అలాగే సిద్దుల గుట్ట వెనుక గల కమ్యూనిటీ హాల్ ను మా హయాంలో పూర్తి చేస్తామని తెలియజేశారు.
కార్యదర్శి రమాకాంత్ మాట్లాడుతూ మేము నిర్వహించబోయే ప్రతీ కార్యక్రమంలో పద్మశాలీలు తప్పక పాల్గొని మాకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఈరవత్రి రాజశేఖర్,త్రివేణి గంగాధర్ లు మాట్లాడుతూ పద్మశాలు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. పద్మశాలీలు 8 తర్పల నుండి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కోశాధికారి బత్తుల భాస్కర్,సర్వసమాజ ప్రతినిధి కొక్కుల విద్యాసాగర్ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
పట్టణ పద్మశాలి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES