Monday, August 31, 2026
E-PAPER
Homeఆటలుపీవీ సింధుకు అరుదైన గౌరవం

పీవీ సింధుకు అరుదైన గౌరవం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ సభ్యురాలిగా అరుదైన గౌరవం లభించింది. గత ఏడాది డిసెంబర్‌లో బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్‌లోకి ఎంపికైన ఆమె, ఇప్పుడు అధికారికంగా కౌన్సిల్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు. శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె తన కొత్త హోదాలో పాల్గొని, ప్లేయర్ల తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తూ షట్లర్ల తరఫున సూచనలు అందించారు. ఈ బాధ్యతను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సింధు వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -