Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగాంధీలో ఏడేండ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

గాంధీలో ఏడేండ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

- Advertisement -

తొలి బాల్య ల్యాపరోస్కోపీ స్ల్పీనెక్టమీగా గుర్తింపు : పీడీయాట్రిక్‌ సర్జరీ హెచ్‌ఓడీ కె.నాగార్జున బృందానికి అభినందనల వెల్లువ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఏడేండ్ల బాలుడు అఖిల్‌(అక్నేపల్లి గ్రామం)కు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఇది మొదటి బాల్య ల్యాపరోస్కోపీ స్ల్పీనెక్టమీగా గుర్తింపు పొందింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన పీడీయాట్రిక్‌ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ, ప్రొఫెసర్‌ కె.నాగార్జున బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.వాణి అభినందించారు. అఖిల్‌ మూడు నెలల వయసు నుంచే హెరిడిటరీ స్పెరోసైటోసిస్‌ వ్యాధితో బాధపడుతూ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో కొంత కాలం చికిత్స పొందాడు. స్ల్పీన్‌ పెరుగుదల, జాండిస్‌, తీవ్ర రక్తహీనత లక్షణాలతో ప్రతి ఏడెనిమిది రోజులకోసారి రక్తమార్పిడి చేయాల్సిన పరిస్థితిలో గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సను ప్రయివేటు ఆస్పత్రుల్లోనే అరుదుగా నిర్వహిస్తున్నారు. అలాంటిది గాంధీ ఆస్పత్రి పిల్లల వైద్య విభాగం ఆ పిల్లవాడికి అధునాతన, సురక్షిత శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ ఆపరేషన్‌ను డాక్టర్లు కె.నాగార్జున, మనోజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, పవన్‌రావు, అశ్రిత్‌రెడ్డి, హర్ష, సాజిద్‌, అనస్తీయా డాక్టర్లు ఆవుల మురళి, సువర్ణ, సిస్టర్లు అరుణ, సువర్ణ, తదితరులు పాలుపంచుకున్నారు. అవసరమైన చిన్నపిల్లలకు ప్రపంచస్థాయి చికిత్సను అందించాలన్న గాంధీ ఆస్పత్రి పీడీయాట్రిక్‌ విభాగం కృషి మరోమారు నిరూపితమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -