Magazines

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తివ్వండి

1 గంట క్రితం

Graduates' MLC elections.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం)కు కాంగ్రెస్‌ ‌విజ్ఞప్తి

జాన్‌‌వెస్లీతో పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, 
మంత్రి పొన్నం, ఎంపీ వేం నరేందర్‌ ‌రెడ్డి భేటీ పార్టీలోనూ, వామ‌ప‌క్షాల‌తో చ‌ర్చించాక
 నిర్ణ‌యం : జాన్‌వెస్లీ


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైద‌రాబాద్ - రంగారెడ్డి - మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం - న‌ల్ల‌గొండ - వరంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు సీపీఐ(ఎం) మ‌ద్ద‌తివ్వాల‌ని టీపీసీసీ అధ్య‌క్షులు బి.మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ గౌర‌వ స‌ల‌హాదారులు, ఎంపీ వేం న‌రేంద‌ర్‌రెడ్డి కోరారు. ఈ మేర‌కు వారు శుక్ర‌వారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాల‌య‌మైన ఎంబీ భ‌వ‌న్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు టి.జ్యోతి, టి.సాగ‌ర్‌, పోతినేని సుద‌ర్శ‌న్‌రావు, బండారు ర‌వికుమార్‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం మ‌హేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాబోయే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు కోర‌డానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాల‌యానికి వ‌చ్చామ‌ని చెప్పారు. దేశంలో నేడు నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఇండియా బ్లాక్‌ ఆధ్వ‌ర్యంలో ‘స‌ర్‌’పై కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, త‌దిత‌ర పార్టీలు పెద్ద ఎత్తున ఉద్య‌మాన్ని న‌డుపుతున్న విష‌యాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో సీపీఐ(ఎం), సీపీఐ త‌మ‌తో క‌లిసి రావాల‌నీ, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరామ‌ని చెప్పారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ...ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత‌లు త‌మ‌ను సంప్ర‌దించార‌న్నారు. గ‌తంలో హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ స్థానంలో తాము బ‌ల‌ప‌ర్చిన ప్రొఫెస‌ర్ కె.నాగేశ్వ‌ర్ రెండు సార్లు గెలిచార‌ని గుర్తుచేశారు. ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ‌-వరంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలోనూ తాము బ‌ల‌ప‌ర్చిన‌ అభ్య‌ర్థులు గణనీయమైన ఓట్లు సాధించార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాము కూడా ఆ స్థానాల్లో పోటీ చేసే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌నీ, వామ‌ప‌క్ష పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌ల‌కు చెప్పామ‌న్నారు. త‌మ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌మావేశంలో, ఆ త‌ర్వాత ఇత‌ర వామ‌ప‌క్ష పార్టీల‌తో చ‌ర్చించిన త‌ర్వాత తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్