Friday, May 8, 2026
E-PAPER
Homeసినిమావాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'రాయవలస

వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘రాయవలస

- Advertisement -

కార్తిక్ జయంతిని హీరోగా పరి చయం చేస్తూ రే సన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రాయవలస. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా, మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ‘లవ్ టైడ్ బై ఫేట్అనే ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంటును ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మ డైరెక్టర్‌గా, వాళ్ల నాన్న ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. కార్తీక్ చాలా టాలెంటెడ్. యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉంది. హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ‘ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది. కార్తీక్‌ని వాళ్ల తల్లిదండ్రులే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం విశేషం. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని నేను గత పదిహేనేళ్లుగా ఏ ఎన్నారైలోనూ చూడలేదు. తప్పకుండా వాళ్లు పడిన కష్టానికి ఫలితం ఉంటుందని నమ్ముతున్నానుఅని కేఎల్ దామోదర్ ప్రసాద్ చెప్పారు. హీరో కార్తీక్ మాట్లాడుతూ,'టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ‘రాయవలస’ రియల్ లైఫ్ ఆధారంగా తీసుకున్న స్టోరీ. దానికి అందరూ కనెక్ట్ అవుతారని, ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకి హార్ట్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని అన్నారు. హీరోయిన్ శ్రీష మాట్లాడుతూ,’ఇది మంచి విలేజ్ డ్రామా. చాలా కొత్త కథతో వస్తోంది. నన్ను ఈ సినిమాలో రాణి పాత్రలో నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాధికకి ధన్యవాదాలుఅని తెలిపారు. నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ,' రేసన్ ప్రొడక్షన్స్‌ను మేము పదేళ్ల క్రితమే మొదలుపెట్టాము. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాము. ఫైనల్‌గా ఇప్పుడు థియేటర్ మూవీతో వస్తున్నాము అని అన్నారు. నేను చేసిన ‘మాయ’ ఫిలిం‌కి యూఎస్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాం. రాఖీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది. మా వారికి కథ నచ్చి ప్రొడ్యూస్ చేద్దామని చాలా ఎంకరేజ్ చేశారు. నా కలని, మా అబ్బాయి కలని నెరవేర్చడానికి మా వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి.
డైరెక్టర్ రాధిక జయంతి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -