Friday, May 8, 2026
E-PAPER
Homeసినిమాస్టెప్పులు వేయించే 'లబ్బరు బొమ్మ`

స్టెప్పులు వేయించే ‘లబ్బరు బొమ్మ`

- Advertisement -

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘లబ్బరు బొమ్మ’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో తారక్ పొన్నప్ప స్టెప్పులు, నందినీ రాయ్ అందాలు ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. రాంబాబు గోశాల సాహిత్యం ఎంతో ఫన్నీగా ఉండటంతో పాటు, దేవ్ జండ్ క్యాచీ ట్యూన్‌ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. శ్రీ కృష్ణ, సాహితీ చాగంటి గాత్రం మరింత స్పెషల్ అట్రాక్షన్, యశ్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట మరింత ప్రత్యేకంగా మారింది అని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ‘అమ్మోరు దిగినాది’ అనే పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ‘లబ్బరు బొమ్మ’ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచేలా ఉంది. మాస్ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్, యూత్‌ మెచ్చే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాత: కండేగుల కుమార్ రాజా, డీఓపీ : మాయా. వి, సంగీతం: దేవ్ జండ్, ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సెట్రామరాజు మల్లెల, సంభాషణలు: ఉదయ్ భాగవతుల, ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -