Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రిప్ పైప్ లైన్ కు మరమ్మతులు

డ్రిప్ పైప్ లైన్ కు మరమ్మతులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారి లో ఏర్పాటుచేసిన సెంట్రల్ డివైడర్ లో నాటిన మొక్కల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన డ్రిప్ పైప్ లైన్ పైపులు ఇటీవల ధ్వంసం అయ్యాయి. బుధవారం స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ధ్వంసమైన డ్రిప్ పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టారు. కొద్దిరోజులుగా డ్రిప్ పైప్ లైన్ అవడంతో నీరంతా జాతీయ రహదారిపై ప్రవహించడంతోపాటు నీరు అందక మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బందితో పలుచోట్ల ధ్వంసం అయిన పైపులైన్లకు మరమ్మత్తులు చేయించారు.

మరమ్మత్తు పనులను పరిశీలించిన ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ డ్రిప్ పైప్ లైన్ దోస ఇవ్వడంతో జాతీయ రహదారిపై మీరంతా వృధాగా పోతుంది అన్నారు. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండంతో వాహనదారులు ఇబ్బందులు పడడంతో పాటు డివైడర్లు నాటిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి అన్నారు. వాహనదారుల ఇబ్బందులు చేర్చడంతో పాటు మొక్కలను సంరక్షించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మరమ్మత్తు పనులు చేయించినట్లు తెలిపారు. సెంట్రల్ డివైడర్ పైప్ లైన్లను మరమ్మత్తు చేయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -