Monday, August 31, 2026
E-PAPER
Homeజిల్లాలునెల్లికుదురు బస్టాండ్‌ ను అభివృద్ధి చేయాలని ప్రజావాణిలో వినతి

నెల్లికుదురు బస్టాండ్‌ ను అభివృద్ధి చేయాలని ప్రజావాణిలో వినతి

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంతంలో ఉన్న మాలిక వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజావాణిలో సూపర్డెంట్ నరసింహారావుకు వినతి పత్రాన్ని అందించినట్లు గ్రామస్తులు వీరగానే మల్లేశం గౌడ్ వరిపల్లి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు బస్టాండ్ చేరుకొని వారు తిరిగి వెళ్ళడానికి ఇక్కడ కనీస మౌలిక వసతులు లేక అనేకమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను తక్షణమే మరదలు చేపట్టి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక కంట్రోలర్లను నియమించాలనీ, బస్సుల రాకపోకలు వేళలు స్పష్టంగా తెలిపే సమాచార బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలనీ, త్రాగునీటి, సౌకర్యంతో పాటు ఫ్యాన్‌ లు అమర్చాలని కోరారు. బస్టాండ్‌ లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడం బాధాకరమనీ, ఏవైనా అనూహ్య సంఘటనలు జరగకముందే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనీ, బస్టాండ్ ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి, ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్ష‍ితమైన ప్రయాణ ప్రాంగాణాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -