డీఈవో యాదయ్య..
నవతెలంగాణ – జన్నారం : ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణలు సహజమేనని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. దేవుని గూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన పిట్ట రాజారావు కు మండల కేంద్రంలోని పిఆర్టియు భవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో గొప్పనైనది అన్నారు. పిట్ట రాజారావు శేష జీవితాన్ని సుఖసంతోషాలతో గడపాలని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంఈఓ విజయ్ కుమార్ ఎస్సై గొల్లపల్లి అనూష, పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు కట్ట రాజమౌళి, ఉపాధ్యాయులు కొండ్రు జనార్దన్ జాజాల శ్రీనివాస్, సత్యనారాయణ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES