– మండలానికో ఫైలట్ గ్రామం ఎంపికను పరిశీలిస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గృహోపయోగ, వ్యవసాయ సేవల సోలరైజేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టును చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మండలానికి ఒక గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీనిచ్చారు. సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి బదులిచ్చారు. గహోపయోగ రూఫ్ టాప్ సోలరైజేషన్ కింద పీఎం సూర్యఘర్ మఫ్ట్ బిజిలి యోజనతో కలిపి మొత్తం 40, 349 గృహాలకు 2కేవీ సామర్థ్య రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని అన్నారు. వ్యవసాయ సేవల సోలరైజేషన్ కింద 16,708 పంపుసెట్లకు సోలార్ సదుపాయం కల్పించినట్టు తెలిపారు. రూఫ్ టాప్ సోలార్ సిస్టంకు కేంద్రప్రభుత్వం 60వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
అంతకుముందు సభలో భట్టి మాట్లాడుతూ, నియోజకవర్గానికి నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్న సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎప్పుడూ అలా చెప్పలేదనీ, సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి సభను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 40వేల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



