- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామం చిన్నదైనప్పటికీ ఆ గ్రామంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఈ గ్రామపంచాయతీ తైబజార్ వేలంపాట మంగళవారం పంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేలం పాటలో రూ. 10 వేల చొప్పున డిపాజిట్ చెల్లించి తైబజార్ వేలంపాటలో పాల్గొన్నారు. చివరగా రూ.60 వేలకు సాఫ్డే అవినాష్ దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో గ్రామ కార్యదర్శి హరీష్ కుమార్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



