నవతెలంగాణ – మల్హర్ రావు: ప్రభుత్వ పాఠశాలల్లోనే వీలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ బొమ్మ రజిత, ప్రాధానోపాధ్యాయుడు టి.సుదర్శనం అన్నారు. బడిబాటలో భాగంగా వల్లెంకుంట గ్రామములో ఏర్పరిచిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, హెచ్ఎం మాట్లాడారు మానవ విలువలు కలిగి ఉండే చదువును పొందే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందన్నారు.
పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత పొందడం మన గ్రామానికి గర్వకారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పుస్తకాలు మధ్యాహ్న భోజనము వీటితోపాటు బ్యాగు టై బెల్టు షూస్ తో కూడిన 9 వస్తువుల కిట్టు ను కూడా అందజేస్తారని తెలిపారు. అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలోనే మన పిల్లల్ని చేర్పించి వారికి మంచి భవిష్యత్తును కల్పిద్దామని సమావేశానికి హాజరైన గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ కటకం స్వప్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. రమేష్ నాయక్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



