నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం (మే 14) హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగగా.. భగీరథ్ తరుఫున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనాలు విన్న న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం (మే 15) విచారణ చేపడతామని పేర్కొంది. బాధితురాలు పుట్టిన రోజు డేట్స్‌పై, గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అని పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వీటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని భగీరథ్ తరుఫు లాయర్ కోరగా.. మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం (మే 15) విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
బండి భగీరథ్ ముందస్తు బెయిల్..వారం రోజులకు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



