Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఉత్సాహంగా బడిబాట కార్యక్రమాలు

మండలంలో ఉత్సాహంగా బడిబాట కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి :  మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకు దూరమైన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు అందరూ పని చేయాలన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల అవగాహన కలిగేలా ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు.  ఆయా పాఠశాలల్లో గత సంవత్సరం అత్యధిక హాజరు ఉన్న, పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రుల సమావేశంలో బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, సర్పంచులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -