Thursday, May 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలి

బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా, నాయకపు గూడ ఇంధనపల్లి మరియు కొమ్ముగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలల యందు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి స్కూల్ కాంప్లెక్స్ ఆశ్రమ పాఠశాల జన్నారం, హెడ్మాస్టర్ శివరాజం scrp రఘునాథం హాజరైనారు. కాంప్లెక్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివరాజం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక (99 Days action plan) లో భాగంగా ‘విద్య వారోత్సవాలు’ 11.05.2026 నుండి 17.05.2025 వరకు నిర్వహించడం జరుగుతుంది.

అని అందులో భాగంగా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి హేబిటేషన్లో బడి ఈడు పిల్లలను గుర్తించి అందరూ బడికి వెళ్లేలా చూడాలని ఎవరు బడి బయట ఉండకూడదని, అంగన్వాడీల్లో ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలని వారికి నచ్చిన పాఠశాలలో ప్రవేశం కల్పించాలని, గ్రామంలోని బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండే విధంగా 100% నమోదు సాధించాలని, డ్రాప్ అవుట్ ను 0% కు తగ్గించాలని కోరడం జరిగింది.

గ్రామంలోని విద్యార్థులు ఎండకు తిరిగి వడదెబ్బ తగలకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. నీడ పట్టున ఉండాలంటే ప్రతి గ్రామ సర్పంచ్ గారు కొన్ని నీతి కథల పుస్తకాలు, మంచి మంచి జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు లాంటి కొన్ని పుస్తకాలను కొని వాటిని గ్రామపంచాయతీ ఆవరణలో ఒక రూమ్ ఏర్పాటు చేసి పిల్లలచే చదివించే విధంగా ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థుల్లో ఉత్సాహంగా చిన్నప్పటినుండే లైబ్రరీకి వెళ్లడం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడం, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునెలా చూడడం లాంటి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ సమావేశానికి పాఠశాల HM L.బిక్కు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్ మరియు తల్లిదండ్రులు హాజరైనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -