Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లీలో ఇసుక వేలంపాట..

డోంగ్లీలో ఇసుక వేలంపాట..

- Advertisement -

భారీ నిధులు రావడం అభినందనీయం: ఆర్ఐ
నవతెలంగాణ – మద్నూర్

నవంబర్ 22న డోంగ్లి మండల పరిధిలో భారీ టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అదే సమయంలో పోలీసులను చూసి రోడ్డు పక్కనే డంపు చేసి వారు పారిపోయారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని డంపు చేసిన ఇసుకను సీజ్ చేశారు. ఈ క్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాల మేరకు నేడు (మంగళవారం) డోంగ్లి మండల ఆర్ఐ సాయిబాబా ఆధ్వర్యంలో ఇసుక వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో అక్రమ ఇసుకను పటాన్ హబీబ్ ఖాన్ రూ.50 వేల ఒక వందకు దక్కించుకున్నారు. కాగా ఈ వేలం పాటలో దాదాపు 12 మంది పాల్గొన్నట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు. ఈ వేలంపాట ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు వచ్చినందుకు ఆర్ఐ అభినందించారు. వేలంపాట అనంతరం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి నివేదికలు పంపినట్లు ఆర్ ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -