Tuesday, January 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి పంచాయితీ నూతన ఉప సర్పంచ్ శివాజీ పటేల్ మృతి

డోంగ్లి పంచాయితీ నూతన ఉప సర్పంచ్ శివాజీ పటేల్ మృతి

- Advertisement -

ఉప సర్పంచ్ మృతి డోంగ్లి గ్రామంలో విషాద ఛాయలు

నవతెలంగాణ మద్నూర్

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి మండలంలో డిసెంబర్ 17న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో డోంగ్లి మండల కేంద్రంలో సర్పంచ్ గా భార్య రేఖ ఉపసర్పంచ్ గా భర్త శివాజీ పటేల్ ఎన్నికయ్యారు డిసెంబర్ 22న భార్యాభర్తలు పంచాయతీ పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు ప్రమాణ స్వీకారోత్సవం జరిగి 15 రోజులు గడవక మునిపే ఉప సర్పంచ్ గా ఎన్నికైన శివాజీ పటేల్ రెండు మూడు రోజుల క్రితం బ్రెయిన్ క్యూమార్ నొప్పి రావడంతో ఆయనను చికిత్సల నిమిత్తం హైదరాబాద్కు తరలించగా ఆదివారం రాత్రి ఏడు గంటల తర్వాత మృతిచెందినట్లు సమాచారం వచ్చింది ఆయన అంత్యక్రియలు సోమవారం డోంగ్లి మండల కేంద్రంలో జరిగాయి ఆయన మృతి పట్ల డోంగ్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఎన్నికల్లో గ్రామ ప్రజలు భార్యాభర్తలకు ఇద్దరికీ మంచి అధికారాన్ని కట్టబెట్టగా బాధ్యతలు చేపట్టి 15 రోజుల కూడా గడవకమునిపే సర్పంచ్ భర్త గ్రామ ఉపసర్పంచ్ మృతి చెందడం గ్రామ ప్రజలను కలతవేసింది ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్త పరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -