నవతెలంగాణ-గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సింగరేణి ఓసీ-3 పనులను బుధవారం కొండంపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోని మహిళలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరై సింగరేణి ఓసీ-3 పనులు, బాంబు బ్లాస్టింగ్ పనులను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సింగరేణి ఎస్‌ఓ టూ జీఎం రవీంద్ర, ఓసీ-3 మేనేజర్ రాంబాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ బిక్షమయ్య, ఎస్‌ఐ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకొని భూ నిర్వాసితులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. ఈ సంద ర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఓసీ-3లో తమ వ్యవసాయ భూములు, ఇండ్లు, ఇంటి స్థలాలు పూర్తిగా సింగరేణి అధికారులు తీసుకొని ఇప్పటివరకు నష్టపరిహారం అందించలేదన్నారు. సింగరేణి అధికారులు డబ్బులు కేటాయించినప్పటికీ రెవెన్యూ, జిల్లా కలెక్టర్ జాప్యం చేయడం వల్ల తమకు నష్టపరిహారం సకాలంలో అందలేదని తెలిపారు. వ్యవసాయ భూములు, ఇండ్లు సింగరేణిలో పోవడం వల్ల మేము రోడ్డున పడ్డామన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా.. ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. కొండంపల్లి గ్రామం మొత్తం తరలించేందుకు సింగరేణి కోట్ల రూపాయలు కేటాయించిందని, రెవెన్యూ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భూములు తీసుకున్నప్పటి నుంచి అధికారులు మారుతున్నారు తప్పా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి ఓసీ-3 పనులను అడ్డగింత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



