Friday, November 7, 2025
E-PAPER
Homeజిల్లాలుతహశీల్దార్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

తహశీల్దార్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి నేటి విద్యార్థులకు, యువతకు, ప్రజలకు స్ఫూర్తినింపేది మన దేశ జాతీయ గేయమే అని తహసీల్దార్ ఎండి ముజీబ్  అన్నారు. దేశ గౌరవం, ఐక్యతను పెంచుతున్న ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ముందు కార్యాలయ సిబ్బందితో కలిసి వందేమాతరం గీతాలాపన చేశారు. బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న దీనిని రచించారని అన్నారు. దేశ ప్రజల ఐక్యతకు, లౌకిక వ్యవస్థ కు చిహ్నం వందేమాతరం గేయం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -