- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో వందేమాతరం గీతాలపన చేశారు. స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతి చేసిన గీతం వందేమాతరం అని ప్రధానోపాధ్యాయులు భగవాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి జి గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



