హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా 'ది మేజ్'. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఆదివారం డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అతిథులుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. నిర్మాత డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి మాట్లాడుతూ,'ఈ సినిమా కథ చెప్పినప్పటి కంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఎక్కువ థ్రిల్ అయ్యాను.
ఈ సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు సెకండాఫ్ చూపు తిప్పుకోలేకపోయాను. అంత గ్రిప్పింగ్ గా రూపొందించారు మా డైరెక్టర్. ఈ సినిమాలో శ్రీరామ్ జాయిన్ అవడంతో మరింత స్ట్రాంగ్ ప్రాజెక్ట్ అయ్యింది' అని తెలిపారు. 'ది మేజ్ అంటే మొక్కజొన్న అనుకుంటున్నారు. కానీ మేజ్ అంటే పద్మవ్యూహం అని అర్థం. దారితెలియని అనూహ్యమైన పరిస్థితుల నుంచి బయటపడే ఓ వ్యక్తి కథ ఇది. ఆ పరిస్థితుల్లో చిక్కుకుని ఆ తర్వాత ఎలా బయటపడతాడు అనేదే ఈ సినిమా నేపథ్యం. ఈ చిత్రంలో మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి' అని డైరెక్టర్ డా. రవికిరణ్ గడలాయ్ అన్నారు. హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) మాట్లాడుతూ,'ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ఇది. ఈ మేజ్ మూవీ మిమ్మల్ని అమేజ్ చేస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా' అని చెప్పారు.






కామెంట్లు (0)