పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో హీరో నాగచైతన్య నటించిన సినిమా ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన గ్రాండ్ మీడియా మీట్లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ, ‘ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ కథ విన్న తర్వాత కార్తీక్ విజన్‌ను నమ్మి ముందుకు వెళ్తున్నాను. ఈ సినిమా కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ అటెంప్ట్. మేమందరం మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఒక కొత్త సినిమా ఇవ్వాలి, ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నంతో కష్టపడి పనిచేశాం. ఎప్పటినుంచో ఒక లార్జ్ స్కేల్ సినిమా చేయాలని, అలాంటి సినిమా నా కెరీర్లో పడాలని కోరుకున్నాను. ‘వృషకర్మ’తో అలాంటి సినిమా వచ్చింది. ఇది ఎప్పటికీ మర్చిపోలేని అవకాశం. మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి థియేటర్లలో ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పినప్పుడు కార్తీక్ భారతదేశంలోనే ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేఒక టాప్ డైరెక్టర్ అవుతాడని అనిపించింది. ఎందుకంటే ఇది విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా స్కోప్ ఉన్న సినిమా. ఇది మనందరం గర్వపడే సినిమా’ అని తెలిపారు.
‘మీ అంచనాలకు మించి సినిమా ఉండబోతోంది. చైతుకి ఈ కథ చెప్పినప్పుడు.. భారతీయ సినిమాల్లో గర్వంగా చెప్పుకునే సినిమాతో వస్తున్నాం, అందులో నేను కూడా పార్ట్ కావడం ఆనందం కలిగిందని అన్నారు. డిసెంబర్ 4న మేమందరం ఒక మంచి సినిమాను ఇవ్వబోతున్నాం. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. తప్పకుండా అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. చాలా కొత్త స్క్రీన్‌ప్లేను ప్రజెంట్ చేస్తున్నాం’ అని డైరెక్టర్ కార్తీక్ దండు చెప్పారు.






కామెంట్లు (0)