పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..

12 నిమిషాల క్రితం

బన్నీ వాస్ వర్క్స్,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, తబిత సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. శనివారం ఈ సినిమా నుంచి 'ఉల్లిపూల..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ, ‘మాది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ బిజీ లైఫ్ లో మనం ఏ బంధాలను కోల్పోతున్నాం అని గుర్తుచేసే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించాను. అబ్బాయి, అమ్మాయి తరుపున ఉండే రెండు కుటుంబాలు కలిసి మా సినిమా చూస్తే వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. మా సినిమా చూశాక చెమర్చిన కళ్లతో, భావో ద్వేగంతో బయటకు వస్తారు’ అని అన్నారు.

‘నేను సినిమా చూశాను. బాగా నచ్చింది. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతంతో చూసినప్పుడు మూవీ ఇంకా బాగా నచ్చింది. కథ, సంగీతం బాగా కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూశాను. ఇది సీరియస్ సబ్జెక్ట్ అని సినిమా అనుకుంటున్నారు. కానీ మీకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. థియేటర్ నుంచి మీరు హ్యాపీగా బయటకు వెళ్తారు. ఇది మా గ్యారెంటీ’ అని ప్రొడ్యూసర్ బన్నీ వాస్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్