Magazines

సరికొత్త అనుభూతినిచ్చే ‘హై’

42 నిమిషాల క్రితం

experience
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్ కృష్ణ ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు ఎస్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు. నేను డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలకు రచయితగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తుంటాను. ‘గాలి సంపత్’ సినిమాకు నిర్మాతగా కూడా చేశాను. నేను దర్శకుడు, నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ‘అతడు’ సినిమా సమయంలో అనిల్ రావిపూడితో పరిచయం ఏర్పడింది. నేను సీరియల్స్‌లో కూడా నటించాను. ‘అమృతం’ సీరియల్‌లో హర్షవర్ధన్ నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. తర్వాత అనిల్ బాబాయ్ అరుణ్ ప్రసాద్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేశాం.


తర్వాత అనిల్ ‘పటాస్’ సినిమా నుంచి రైటర్‌గా పనిచేశాను. ఒక మంచి కథ చెప్పాలని ‘హై’ సినిమా రాసుకున్నాను. ఈ కథను నేనే దర్శకుడిగా, నటుడిగా చేస్తే బాగుంటుందనిపించింది. సినిమా చూసిన తర్వాత నటుడిగా, దర్శకుడిగా ఏది బాగా చేశానో ప్రేక్షకులు చెప్పాలి. అనిల్ సినిమాలకు పనిచేస్తూనే ఖాళీ సమయం దొరికినప్పుడు నా సొంత డబ్బులతో ఈ సినిమా చేశాను. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో సహకారం అందించారు. ఇది డిఫరెంట్ మూవీ. కొత్త నటులు ఉన్నప్పుడు బిగినింగ్‌లో కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, ఒక్కసారి కథలోకి వెళ్లిన తర్వాత అందులో లీనమైపోతారనే నమ్మకం ఉంది. ఇందులోని పాత్రలన్నింటికీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక హై ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ‘హై’ అనే టైటిల్ పెట్టాను. ప్రేక్షకులు సాటిస్ఫై అవుతారు. ఈ కథ రాసుకున్నప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో ఎంత ఆస్వాదిస్తారనేది చూసుకున్నాను. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ చాలా హై ఫీలయ్యారు. కచ్చితంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్‌కు రీచ్ అవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్