హీరో శర్వా నంద్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్లో హీరో శర్వా మాట్లాడుతూ, ‘కార్తీక పౌర్ణమి రోజు ‘గంగా’ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ అయిన తర్వాత మ్యూజికల్ ఈవెంట్ పెట్టమని డైరెక్టర్ని నేనే అడిగాను. చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం రాశారు. ఈ సినిమాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్స్ చంద్రబోస్. భీమ్స్ ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేశారు. చాలా కొత్త టాలెంట్‌ను, సింగర్స్‌ను పరిచయం చేస్తున్నారు. తన ఫస్ట్ సినిమా నాదైనందుకు హ్యాపీగా ఉంది.
‘భోగి’తో మళ్లీ చరిత్రలో నిలిచిపోయే పాటలు ఇచ్చినందుకు ఆయనకు థాంక్యూ. సంపత్ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మా ప్రొడ్యూసర్ రాధామోహన్‌కి కృతజ్ఞతలు. డింపుల్, అనుపమ చాలా అద్భుతంగా నటించారు. నా కెరీర్లో 37 సినిమాలకు ఎంత కష్టపడ్డానో, ఈ ఒక్క సినిమాకు అంత కష్టపడ్డాను. కచ్చితంగా మీకు ఒక కొత్త సినిమా, డిఫరెంట్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు సినిమా చూసి బయటికి వచ్చి ‘ఇదిరా సినిమా’ అని అనుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
‘మొదట రిలీజ్ చేసిన ‘ఎగిలివారంగా’ పాట ప్రతి ఇంటికీ వెళ్లింది. పల్లె బతికున్నంత వరకు ఆ పాట బతుకుతుంది. అలాగే తర్వాత వచ్చిన ‘అన్నయ్య ప్రాణంలో’ పాట కూడా అద్భుతమైన ఆదరణ అందుకుంది. అన్నాచెల్లెళ్ల రిలేషన్‌ను అద్భుతంగా ఆవిష్కరించింది. ఇందులో మరో పాట ఉంది. అది ఈ రెండు పాటలకు మించి ఉండబోతోంది’ అని చెప్పారు.
ఆద్యంతం వైవిధ్యం!
37 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)