Magazines

‘స్ట్రైకర్’ రిలీజ్‌కి రెడీ

43 నిమిషాల క్రితం

Striker
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

2003లో ‘తొలి పరిచయం’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కిరణ్ కర్నీడి 23 ఏళ్ల తరువాత ‘స్ట్రైకర్’ చిత్రంతో తన సత్తాను చాటుకునేం దుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బుధవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ’తో తాను రూపొందించిన ఈ పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్ రిలీజ్ కు అవసరమైన సాంకేతిక సన్నాహాలు చేసుకుంటోంది. సంప్రదాయ కమర్షియల్ సినిమా విలువలు కొనసాగిస్తూనే అద్భుత సాంకేతిక మాయా జాలంతో సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కిం చడం, ఈ రంగంలో కొత్త బాటలు వేయడం ఈ చిత్రం ప్రధాన ఉద్దేశం అని కిరణ్ కర్నీడి చెబుతున్నారు. శక్తివంతమైన సాంకేతికతకు- బలీయమైన భావోద్వే గాలు, పుష్కలమైన వినోదం మేళవించి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఈ చిత్రం అందిస్తుందని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ - ఎ. ఐ. క్రియేటర్: శ్రీనాధ్ మాచర్ల, మ్యూజిక్; మ్యాజిక్ మష్రూమ్స్, బిజీఎం: శాలిని మిశ్రా, నిర్మాణం - దర్శకత్వం: కిరణ్ కర్ణీడి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్