రోజ్ సర్దానా, తమిళ నటుడు చరుకేశ్ మంగత్ కలిసి ప్రత్యేక తమిళ్-హిందీ క్రాస్‌ఓవర్ పాట షూటింగ్‌ను పూర్తి చేశారు. నటి రోజ్ సర్దానా తన సినీ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన తమిళ్-హిందీ క్రాస్‌ఓవర్ ప్రాజెక్ట్‌ను చేశారు. ఇటీవలే చరుకేశ్ మంగత్‌తో కలిసి నటించిన ప్రత్యేక పాట షూటింగ్‌ను ఆమె పూర్తి చేశారు. విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఈ ఇద్దరు నటీనటుల కలయిక ఒక ఆసక్తికరమైన కొత్త భాగ స్వామ్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం రోజ్ ఒక రాబోయే చిత్రంలో కథానాయికగా నటిస్తు న్నారు. ఆమె కెరీర్‌లో ఇది ఒక ఆసక్తికరమైన దశ. గతంలో ఆమె ‘దృశ్యం 2’, ‘భూల్ బలయ్య 3’, వైల్డ్ వైల్డ్ పంజాబ్, ఏక్ చతుర్ నార్, ముఖలవ్వ, గోదాన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. విభిన్న చిత్ర ప్రాజెక్టుల ద్వారా తెరపై తన ఉనికిని మరింత బలోపేతం చేసు కుంటూ వస్తున్నారు. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘సతయవన్ సావిత్రి’లో కథానాయ కుడిగా నటించిన చరుకేశ్ మంగత్, ఈ ప్రత్యేక పాటలో రోజ్‌తో కలిసి నటించారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ పాటపై అందరి లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ పాట ఆద్యంతం అలరిస్తుందని మేకర్స్ దీమా వ్యక్తం చేశారు.






కామెంట్‌లు (0)