సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఐ హేట్ మ్యారేజ్'.
పరమేష్ రేణు కుంట్ల దర్శకుడు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
నిర్మాత మాదం దయానంద్ మాట్లాడుతూ,‘ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి జెన్ జీ తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాను. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. ఇందులోని భావోద్వేగాలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి.
ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా, నిజ జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపించనుంది’ అని తెలిపారు.
‘మాట్లాడుకోవడానికి చదవడానికి ఇష్టపడని సంఘటనలు మన కళ్ల ముందు జరిగితే రకరకాల డిస్కషన్స్ చేస్తుంటారు. అలాంటి సంఘటనల సమహారమే ఈ చిత్రం. ఈ ట్రైలర్ చూడగానే ఇంత బోల్డ్ కంటెంట్‌తో ఎందుకొస్తున్నావు అని అందరూ అన్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఇది బోల్డ్ కంటెంట్ కాదు... చూడటానికి ఇష్ట పడని మెచ్యూర్డ్ కంటెంట్. నేడు సొసైటిలో జరుగుతున్న కథ. ప్రతి ఒక్కరూ వాళ్లకు తెలిసిన వాళ్ల కథను చూస్తున్నామనే భావన కలుగుతుంది’ అని దర్శకుడు రేణికుంట్ల పరమేష్ తెలిపారు.
బోల్డ్ కంటెంట్ సినిమా కాదు
40 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)