Magazines

విభిన్నమైన ప్రేమకథ

2 గంటల క్రితం

love story
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవు తుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తు న్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. నేడు (బుధవారం) ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ పోస్టర్‌లో అనీష్ కారు నడుపుతూ సీరియస్‌గా కనిపిస్తుండగా, పక్కనే కూర్చున్న అనస్వర రాజన్ టెన్షన్తో కనిపిస్తున్నారు. పగిలిపోయిన కారు అద్దం, గాల్లో ఎగురుతున్న గాజు ముక్కలు, వారి వాహనాన్ని వెంబడిస్తున్న కొంతమంది వ్యక్తులతో పోస్టర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. హీరోహీరోయిన్ల జీవితాల్లో చోటు చేసుకోబోయే అనూహ్య పరిణామాలను ఈ పోస్టర్ సూచిస్తోంది. ఇదొక ఓ విభిన్నమైన ప్రేమకథ. అర్జున్ అనే మూగ యువకుడు తన జీవితమంతా కీర్తిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. అయితే, తన మనసులోని భావాలను మాటల ద్వారా వ్యక్తపరచలేకపోవడంతో అతని ప్రయాణం అనూహ్యమైన మలుపులు తిరుగు తుంది. ప్రేమ, హాస్యం, సాహసం, ఊహించని ట్విస్టులతో ఈ కథ సాగనుంది. సాంకేతికంగా ఈ సినిమాతో రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా పరిచయం అవుతున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు చార్ట్‌బస్టర్ స్పందన లభించడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి అని మేకర్స్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్