రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించి చిత్రం ‘డానీ’.
ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని ఈనెల 20న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సోమవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఆశిష్ గాంధీ మాట్లాడుతూ,‘కళ్యాణ్, నేను, రిజ్వాన్ కలిసి ‘నాటకం’ చేశాము. మళ్లీ ఇప్పుడు ‘డానీ’తో కలిశాం. ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా. ఇందులో రాకేందు పాటలు, సాయి కార్తీక్ మ్యూజిక్ గొప్పగా ఉంటుంది. ఆనంద్ అద్భుత మైన విజువల్స్ ఇచ్చారు’ అని తెలిపారు.
‘ఇలాంటి ఓ డిఫరెంట్ లవ్, రస్టిక్ డ్రామాకి రిజ్వాన్ లాంటి నిర్మాత అయితేనే న్యాయం చేస్తారని అనిపించింది. చివరి నిమిషంలో సేజల్‌ని తీసుకున్నాం. రాకేందు ఉంటే నాకు భరోసాగా అనిపిస్తుంది. ఆనంద్ వర్క్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మా ఆడియో రైట్స్ తీసుకున్న కే మ్యూజిక్‌కి థాంక్స్’ అని దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ చెప్పారు.
నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ,‘ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. గోవాలోనే ఎక్కువ భాగం చిత్రీకరించాం. ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.






కామెంట్‌లు (0)