Magazines

సితార ద్వారా ‘ఓం..’ విడుదల

27 నిమిషాల క్రితం

Om
avatar
balaji

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సిద్ధమైంది. ఈనెల 20న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనుంది. జాతీయ అవార్డులు అందుకున్న ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల, నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘అమరన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరమైన కథ,కథనాలు, అద్భుతమైన నటన, హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్