Magazines

సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌

27 నిమిషాల క్రితం

Released as a summer special
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో బండి సరోజ్ కుమార్ ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని ఆయనే నిర్వర్తించారు. బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ,‘ఈ సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఫిబ్రవరిలో టీజర్ ప్లాన్ చేశాం. కానీ ఈ మగాడు సీన్‌ని ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశాడు. నేను ఎంతో ట్రామాని అనుభవించాను. అందుకే టీజర్‌ను ఇంత ఫాస్ట్‌గా వదిలాం. ఇండస్ట్రీలో, సెట్‌లో మాకు సెక్యూరిటీ లేదు. మీడియా లేకపోతే నేను లేను. నా ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన విలేకరులకు ధన్యవాదాలు. ఈ కథను 700 రోజులు కష్టపడి రాశాను. రివ్యూ యర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్ ప్లేని రాసుకున్నాను. కథకు తగ్గట్టుగా నాకు మంచి ఆర్టిస్టులు దొరికారు. ఆర్ట్ డైరెక్టర్ నాని నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రమోద్ నాకు అండగా నిల బడ్డారు. సమ్మర్‌లో కలుద్దాం. ఈ సినిమాతో మేమెంటో అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.

‘సరోజ్‌తో నాకు ఎప్పట్నుంచో అనుబంధం ఉంది సరోజ్ ‘ఛప్రి’తో ఆడియెన్స్‌ ముందు రాబోతోన్నారు. థియేటర్లో ఈ సినిమా దద్దరిల్లిపోతుంది’ అని ప్రమోద్ పడమటి అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్