అగ్ర కథానాయకుడు వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ వేడుక మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ, ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అద్భుతమైన స్పందన చూసి ఆనందంగా ఉంది. కాలేజ్ లైఫ్ లో నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఈ రోజులు మళ్ళీ రావు. మీరు కూడా మంచి మెమోరీస్ ఉండేలా చూసుకోండి. మీ కలను నిజం చేసుకోండి. కాలేజ్ అంటే డిగ్రీ, జాబ్ మాత్రమే కాదు.. మంచి క్యారెక్టర్ తో బయటకు రావాలి. ఈనెల 30న మా సినిమా విడుదలవుతోంది.
మీ అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఈ సినిమా మీరు ఊహించిన పద్ధతిలో కాకుండా, వేరే డైరెక్షన్ లో ఉండే లాంటి అవకాశమున్న సినిమా ఇది. నార్మల్ రొమాంటిక్ కామెడీ కాకుండా వేరే వేరే అంశాలను కూడా డిస్కస్ చేయడం జరిగింది. క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ అలాంటివి ట్రై చేశాము. నాకు, వెంకీకి కూడా ఇది ఫస్ట్ అటెంప్ట్. పని చేసేటప్పుడు ఈ సినిమా మా అందరికీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్ జాబ్ చేశాడు. దాదాపు 7-8 పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఉంటాయి’ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు.






కామెంట్లు (0)