ఏగన్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో, హీరో యిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందు తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు రచయిత, నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ, ‘ఈ సినిమా నా హార్ట్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. లవ్ లో ఉన్నా, రిలేషన్ షిప్ లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్‌లో ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాపై నేను చాలా నమ్మకంగా ఉన్నాను. సిద్దు కుమార్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. 200 పర్సెంట్ మళ్ళీ హైకూ సక్సెస్ మీట్ లో కలుద్దాం’ అని హీరో ఏగన్ అన్నారు. డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ, ‘ఈ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. హైకూ కి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ జాబిలీ (శ్రీదేవి). ఆమెకు ఇది తమిళ్ డెబ్యూ. ఆవిడ కళ్ళతో ఏ భాష అయినా మాట్లాడగలదు. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్ట పడింది. సినిమా ఔట్ పుట్ చాలా ప్లెసెంట్ గా వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. కోన వెంకట్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ట్రైలర్ చూడగానే కూల్‌గా, ఆహ్లాదంగా అనిపించింది. ముందే ఓటీటీకి అమ్మేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం నిజంగా గ్రేట్. నెట్ ఫ్లిక్స్ వారికీ స్టోరీ చెప్పి ఈ సినిమా తీశారంటే వాళ్ళని ఈ స్క్రిప్ట్ ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ కచ్చితంగా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్ లోని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించారు. మనల్ని మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. ప్రత్యేకంగా ఈ సినిమాను శ్రీదేవి కోసం చూడాలి. ఏగన్ వెల్ కమ్ టు తెలుగు ఇండస్ట్రీ’ అని తెలిపారు.
మీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా
2 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)